దర్శకుడు అనిల్ రావిపూడి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు?.. ఆయన ‘లవ్ స్టోరి’లో ట్విస్ట్ ఇదే..!

టాలీవుడ్ లో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా డైరెక్టర్ అనిలా రావిపూడి ఉన్నారు. ఇటీవల విడుదలైన F3 ఫిల్మ్ తో సక్సెస్ అందుకున్నారు అనిల్ రావిపూడి. ఎఫ్ 2కు సీక్వెల్ గా ఈ పిక్చర్ వచ్చినప్పటికీ ఈ సినిమాలో స్టోరి ట్రీట్ మెంట్, క్యారెక్టరైజేషన్స్, కామెడీ చాలా డిఫరెంట్ గా ఉండటంతో ఆడియన్స్ కు చాలా బాగా నచ్చింది ఈ మూవీ.

విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ ఫిల్మ్ సమ్మర్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిపోయింది. ఇక ఈ సంగతులు పక్కనబెడితే.. దర్శకుడు అనిల్ రావిపూడి రియల్ లైఫ్ లోని లవ్ స్టోరి గురించి కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరి తెలుసుకుందాం.

తాను చదువుకునే రోజుల్లో కాలేజీ అయిపోగానే బ్యాచ్ మొత్తం మరో నలుగురు అమ్మాయిలున్న బ్యాచ్ ను ఫాలో అయ్యేవాళ్లమని చెప్పాడు అనిల్. ఆ నలుగురు అమ్మాయిలలో ఒకరు అంటే తనకు చాలా ఇష్టమని, కానీ, ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ అమ్మాయికే పెళ్లయిపోయిందని వివరించాడు. అలా తాను సైట్ కొట్టిన అమ్మాయికి పెళ్లి అయినప్పటికీ, సదరు అమ్మాయి ఫ్రెండ్ ను తాను మ్యారేజ్ చేసుకున్నట్లు అనిల్ రావిపూడి తెలిపాడు.

అలా అనిల్ రావిపూడి తన లవ్ స్టోరిలో ట్విస్ట్ ని తెలిపాడు. తన భార్య ఫ్రెండ్ కు లైన్ వేయడానికి ట్రై చేస్తే తన భార్య పడిపోయిందని అనిల్ రావిపూడి ఫన్నీగా చెప్పుకొచ్చారు. ప్రతీ రోజు తనకు, తన భార్యకు మధ్య ఈ విషయమై చిన్న చిన్న గొడువలు జరుగుతాయని వివరించారు. F2 ఫిల్మ్ లోని కొన్ని సన్నివేశాలు తన రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించినవని అనిల్ రావిపూడి తెలిపారు. అనిల్ రావిపూడి ..నందమూరి నటసింహం బాలయ్యతో సినిమా చేయనున్నారు. అదొక డిఫరెంట్ జోనర్ ఫిల్మ్ అని అనిల్ రావిపూడి చెప్పారు.