నయనతార చెల్లి గురించి ఈ విషయాలు తెలుసా..?

-

తాజాగా మెగాస్టార్ చిరంజీవి రీమేక్ మూవీగా తెరకెక్కించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార చెల్లిగా తాన్యా రవిచంద్రన్ నటించిన విషయం తెలిసిందే. ఈమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే హీరో కార్తికేయతో రాజా విక్రమార్క అనే చిత్రంలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు . కానీ తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార చెల్లెలిగా నటించడంతో అందరి చూపు ఒక్కసారిగా ఈమె పైనే పడింది. తమిళ్ ఇండస్ట్రీకి చెందిన తాన్య మొదట్లో కురుప్పన్, బృందావనం లాంటి తమిళ్ సినిమాలలో నటించి మెప్పించింది. అంతేకాదు ఇటీవల వచ్చిన నెంజుక్కు నీది అనే తమిళ సినిమాలో కూడా నటించింది.

ఇక ఈమె తాత మలేషియన్ తమిళ్ యాక్టర్ రవిచంద్రన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయనను చూసి తాన్య కూడా ఇండస్ట్రీలోకి రావాలని తెగ ఆసక్తి చూపించింది. ఇక అలా తన తాత సహాయంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఈమె తల్లి లావణ్య శ్రీరామ్ మంచి క్లాసికల్ డాన్సర్.. ఈ క్రమంలోనే తాన్య అలాగే ఆమె చెల్లెలు కూడా భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. ఇక బ్యాచ్లర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఇక అలా తన చిత్రాలతో కొనసాగుతూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. నిజానికి తమిళ్ ప్రేక్షకులకు మాత్రమే ఈమె గురించి బాగా తెలుసు. కానీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదని చెప్పాలి. ఎట్టకేలకు గాడ్ ఫాదర్ సినిమాలో జాన్వి క్యారెక్టర్ లో నయనతార చెల్లిగా నటించి మెప్పించింది. ఇక ఈమె అందానికే కాదు నటనకు కూడా దర్శక నిర్మాతలు సైతం ఈమెను తమ తదుపరి సినిమాలలో తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మకు గాడ్ ఫాదర్ సినిమా ద్వారా మరింత గుర్తింపు లభించింది అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news