చైల్డ్ ఆర్టిస్ట్‌గానే కాక హీరోయిన్‌గా రాజశేఖర్‌తో సినిమాలు చేసిన నటి.. ఎవరంటే?

టాలీవుడ్ సీనియర్ హీరో, యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘శేఖర్’ పిక్చర్ విడుదలైంది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫోకస్ పెట్టేశారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. రాజశేఖర్ తో ఒకనాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసిన అమ్మాయి ఆ తర్వాత కాలంలో ఆయన సరసన హీరోయిన్ గానూ యాక్ట్ చేసింది. ఆ హీరోయిన్ ఎవరు ? ఆ సినిమాలు ఏంటి? అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

‘వందేమాతరం’ చిత్రంతో డాక్టర్ రాజశేఖర్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు వరుస సక్సెస్ అయ్యాయి. అలా ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ అయిపోయారు. ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి చక్కటి రెస్పాన్స్ వచ్చింది.

ఆ క్రమంలోనే రాజశేఖర్-ముత్యాల సుబ్బయ్య కాంబోలో వచ్చిన ‘మమతల కోవెన’ అనే సినిమాలో రాజశేఖర్ సరసన హీరోయిన్ గా సుహాసిని నటించింది. ఈ ఫిల్మ్ లో రాజశేఖర్ కూతురిగా రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అదే రాశి..హీరోయిన్ గా ‘నేటి గాంధీ’ చిత్రంలో రాజశేఖర్ సరసన నటించింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కింది.

అలా రాజశేఖర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా నటించి రాశి ..ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మికలిద్దరూ.. సినిమాల్లో ఆయన నటవారసులుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. వారిరువురు ప్రస్తుతం తమ సినిమాలపైన ఫోకస్ పెడుతున్నారు. రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ చిత్రానికి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించారు.