అంత పెద్ద ఆఫర్ వచ్చినా వద్దన్న అల్లు అర్జున్.. అదేమిటంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన సంగతి అందరికీ విదితమే. పాన్ ఇండియా వైడ్ గా ఈ పిక్చర్ ను ప్రజలు విశేషంగా ఆదరించారు. ‘పుష్ప’రాజ్ గా బన్నీ పర్ఫార్మెన్స్ ఈ ఫిల్మ్ లో నెక్స్ట్ లెవల్ లో ఉందని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. తమ హీరో ఈ మూవీ ద్వారా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

బన్నీ ప్రస్తుతం ‘పుష్ప-2’ షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ పిక్చర్ లో హీరోయిన్ గా క్యూట్ బ్యూటీ రష్మిక మందన, విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఈ సంగతులు అలా పక్కనబెడితే..బన్నీ సినిమాలతో పాటు పలు బ్రాండ్స్ కు అంబాసిడర్ గానూ వ్యవహరిస్తున్నారు. ఇటీల ఓ యాడ్ షూటింగ్ కూ అల్లు అర్జున్ హాజరయ్యారు.

ఒక్కో బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి అల్లు అర్జున్ రూ.ఏడున్నర కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అస్ట్రాల్, జొమాటో, కేఎఫ్ సీ, కోకా కోలా, రెడ్ బస్ లకు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ అయిన బన్నీ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకోవడంపైన పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.

ఇటీవల అల్లు అర్జున్ ను తమ గుట్కా బ్రాండ్, లిక్కర కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని కోరగా, అల్లు అర్జున్ నో చెప్పారట. ఇందుకు భారీ రెమ్యునరేషన్ అనగా రూ.పది కోట్లు ఆఫర్ చేసినప్పటికీ బన్నీ నో చెప్పేశారని సమాచారం. లిక్కర్ బ్రాండ్స్, సరోగేట్స్, గుట్కా ప్రచారాలకు తను వ్యతిరేకం అని బన్నీ చెప్పారట. ఈ విషయం తెలుసుకుని అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.