అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ కు ఫ్రిపెర్ అవుతున్నారా? ఈ టిప్స్ మీ కోసమే..జాబ్ పక్కా..

-

మన దేశానికి ఆర్మీ చేస్తున్న సేవల గురించి అందరికి తెలుసు..వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి మరీ మనకు సెక్యురిటీ ఇస్తున్నారు..ఈ మధ్య యువత ఎక్కువగా ఆర్మీలో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్‌ స్కీమ్‌ను తీసుకువచ్చింది..ఎయిర్‌ఫోర్స్‌, నేవీల్లో ఇప్పటికే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ మొదటి బ్యాచ్ రిక్రూట్‌మెంట్ కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి రిక్రూట్ మెంట్ టెస్ట్ లు, ర్యాలీలు నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. ఇలా వివిధ విభాగాలలో రాత పరీక్షలు, ఫిజికల్, మెడికల్ రౌండ్ లలో సెలక్ట్ అయిన వారి నుండి షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను డిసెంబర్ 11, 2022న ప్రకటించి.అదే నెలలో మొదటి బ్యాచ్ ను శిక్షణ కోసం పిలుస్తారు.

ఒకసారి IAFలో చేరిన తర్వాత, అగ్నివీర్స్ ఎయిర్ ఫోర్స్ యాక్ట్ 1950 ప్రకారం నాలుగేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ కు ఎలా ప్రిపేర్ అయితే మంచి స్కొర్ చెయ్యొచ్చు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అగ్నివీర్ గా అర్హత సాధించాలంటే మొత్తం 5 రకాల పరీక్షలు ఎదుర్కోవాలి. 1) ఆన్ లైన్ ఎగ్జామ్, 2)డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ రౌండ్, 3)ఫిజికల్ టెస్ట్ 4) అడాప్టబిలిటీ టెస్ట్ 5) మెడికల్ టెస్ట్ ఇలా ఐదు రకాల పరీక్షలు ఎదుర్కోవాలి. ఇలా ఐదు రకాల పరీక్షలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. చివరిగా డిసెంబర్ లో సెలక్షన్ లిస్ట్ ప్రకటించి మొదటి బ్యాచ్ ను సిద్దం చేస్తారు. కాగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ లో సెలక్ట్ అవడం కోసం మొదట వ్రాత పరీక్ష 25 జూలై, 2022న నిర్వహించారు…

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ పరీక్షలు మూడు విభాగాలుగా జరుగుతాయి. 1)Science, 2)Other than Science, 3)Science and other than Science అనే మూడు గ్రూపులుగా జరుగుతాయి. పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో నిర్వహించారు. పరీక్షలో అడిగే ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇవ్వబడుతుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కు ఉంటుంది…

Science గ్రూపుకి సంబంధించి, ఇంగ్లీష్ 20, మేధమేప్టిక్స్ 25, ఫిజిక్స్ 25 మార్కులు కలిపి 70 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాలు సమయం ఇస్తారు. Other than Science గ్రూపుకి సంబంధించి రీజనింగ్ అండ్ జనరల్ అవేర్ నెస్ 30 మార్కులు, ఇంగ్లీష్ 20 మొత్తం 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. 45 నిమిషాల సమయం ఇస్తారు. సైన్స్ గ్రూప్ కు సంబంధించి మేధమేటిక్స్ 25, ఇంగ్లీష్ 20, రీజనింగ్ & జనరల్ అవేర్‌నెస్ 30, ఫిజిక్స్ 25 మార్కులు కలిపి 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 85 నిమిషాలు సమయం ఇస్తారు.ఈ సమయం చూసి రాయాల్సి ఉంటుంది…

పరీక్షకు ముందు కనీసం 5 నుండి 6 మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయడం, పరీక్ష కోసం ఖచ్చితమైన తయారీ కోసం టెస్ట్ నమూనాను సేకరించడం, అధిక వెయిటేజీ అంశాలు, ఎక్కువ మార్కులు వచ్చే ప్రశ్నలు అంశాలపై దృష్టి పెట్టడం వంటి చిట్కాలను పాటిస్తే ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ లో మంచి మార్కులతో ఆన్ లైన్ రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫై కావచ్చు. సులభమైన ప్రశ్నలను ముందుగా ప్రయత్నించి, సమయాన్ని సేవ్ చేసుకోవడం, ఏదైనా ప్రశ్న కష్టంగా అనిపిస్తే, సమయాన్ని వృధా చేయకుండా, చివరిగా ఆన్సర్ చేసేలా పెట్టుకోవడం, మార్కింగ్ స్కీమ్‌తో పాటు పరీక్షలో ముఖ్యమైన అంశాల వెయిటేజీని తెలుసుకోవడం వంటివి చేయాలి. అప్పుడే పరీక్షలో ఉత్తీర్ణత సాధించవచ్చు..

రిటన్ టెస్ట్ తర్వాత 3వ రౌండ్ గా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ కు వెళ్లాలి. ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఫిజికల్ ఫిట్‌నెస్ ప్రమాణాలు చూస్తే.. 1.6 కిమీ పరుగును కేవలం 6 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాలి. అనంతరం నిర్ణీత సమయంలో 10 పుష్-అప్‌లు, 10 సిట్-అప్‌లు, 20 స్క్వాట్‌లు చేయాల్సి ఉంటుంది. ఇలా ఫిజికల్ రౌండ్ కూడా పూర్తవుతుంది…సెలక్ట్ అయినవారికి వైద్య పరీక్ష ను నిర్వహిస్తారు. ఇక్కడ మెడికల్ టెస్ట్ లో నిర్వహించబడే వివిధ వైద్య పరీక్షలు క్రింద వివరించబడ్డాయి..ఇలా ఐదు టెస్టులు సెలెక్ట్ అవ్వాలి..పరీక్షల ఫలితాలను డిసెంబర్ మొదటి వారంలో ప్రకటించి, షార్ట్‌లిస్ట్ లో ఎంపిక చేయబడిన అభ్యర్థులను ప్రకటిస్తారు. అనంతరం డిసెంబరు చివరి నాటికి మొదటి బ్యాచ్ నమోదును సిద్దం చేసి, డిసెంబర్ 30, 2022 నాటికి శిక్షణ ప్రారంభమవుతుంది. చివరిగా డిసెంబర్ లో సెలక్షన్ లిస్ట్ ప్రకటించి మొదటి బ్యాచ్ ను సిద్దం చేస్తారు..ఇలా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్..

Read more RELATED
Recommended to you

Latest news