అమ్మాయిల కలల రాకుమారుడు.. ‘ప్రేమదేశం’ హీరో అబ్బాస్ ప్రజెంట్ ఏం చేస్తున్నాడో తెలుసా?

-

సుమారు 25 ఏళ్ల కిందట విడుదలైన సూపర్ హిట్ యూత్ ఫిల్మ్ ‘ప్రేమదేశం’ గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో హీరోగా నటించిన అబ్బాస్ కు అమ్మాయిలలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అలా అమ్మాయిల కలల రాకుమారిడిగా అబ్బాస్ ఉండిపోయాడు. ఈ చిత్రంలో అబ్బాస్ అత్యద్భుతమైన నటన చూసి ఫిదా అయిపోయారు ప్రేక్షకులు.

ప్రియురాలి కోసం పరితపించే ప్రేమికుడిగా అబ్బాస్ నటనకు ప్రేక్షకులు వందకు వంద మార్కులేశారు. అలా యూత్ ఐకాన్ అయిపోయాడు. హ్యాండ్ సమ్ రిచ్ లుక్ లో అబ్బాస్ ‘ప్రేమ దేశం’ ఫిల్మ్ లో ఎవర్ గ్రీన్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే, ఆ తర్వాత కాలంలో అబ్బాస్ అస్సలు కనబడకుండా పోయాడు. అడపా దడపా పలు చిత్రాలు చేసినట్లు అనిపించినా సరైన హిట్ పిక్చర్ అయితే పడలేదు. అలా అబ్బాస్ ఖాతాలో మరో చిత్రమేది పడక కనుమరుగైపోయాడు అబ్బాస్.

పలు తెలుగు చిత్రాల్లో అబ్బాస్ కీలక పాత్రలు పోషించాడు. కానీ, అవేవీ కూడా తనను సినీ కెరీర్ తర్వాత కాలంలో నిలబడేలా చేయలేకపోయాయి. ఈ క్రమంలోనే అబ్బాస్ సినిమాల నుంచి సైన్ ఔట్ అయిపోయాడు. బతుకు దెరువు కోసం న్యూజిలాండ్ వెళ్లి అక్కడ కొంత కాలం పెట్రోల్ బంక్ లో పని చేసిన అబ్బాస్.. ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశాడు. ఆ తర్వాత కన్ స్ట్రక్షన్ రంగంలో గ్రిప్ సంపాదించి బిల్డర్ గా ఎదిగాడు. అలా సక్సెస్ ఫుల్ బిల్డర్ గా పేరు సంపాదించుకున్న అబ్బాస్ అక్కడే సెటిల్ అయిపోయాడు. అలా ఒక చోట దారులు మూసుకుపోయిన క్రమంలో మరో చోట దారి వెతుక్కుని సక్సెస్ అయ్యాడు అబ్బాస్.

 

Read more RELATED
Recommended to you

Latest news