చిరంజీవికి డూప్‌గా నటించిన వ్యక్తులు వీళ్లే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ రిలీజ్ కాబోతున్నదని తెలుస్తోంది. ఆయన గత చిత్రం ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా, ‘గాడ్ ఫాదర్’ డెఫినెట్ గా సూపర్ హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంగతులు పక్కనబెడితే..మెగాస్టార్ చిరంజీవికి డూప్ గా నటించడం చాలా కష్టమని ఈజీగా చెప్పేయొచ్చు. కానీ, మెగాస్టార్ సూపర్ హిట్ ఫిల్మ్ లో మాత్రం అచ్చం మెగాస్టార్ చిరంజీవి మాదిరిగా ఇద్దరు వ్యక్తులు నటించారు. ఆ చిత్రం బ్లాక్ బాస్టర్ అయింది. ఆ మూవీయే ‘ముగ్గురు మొనగాళ్లు’. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇందులో చిరంజీవికి డూప్ లుగా చిరంజీవి పీఏ సుబ్బారావు, నటుడు ప్రసాద్ రావు నటించారు. వీరిరువురు చిరంజీవకి హైట్ ఉండటంతో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం అలానే ఉండటంతో వారినే డూప్ లుగా మేకర్స్ తీసుకున్నారు. ఈ మూవీలోనే కాకుండా ఇంకా పలు చిత్రాల్లోనూ వీరిరువురు మెగాస్టార్ చిరంజీవికి డూప్ లుగా నటించారు. ఇక ఇందులో పోలీస్ ఆఫీసర్, దత్తాత్రేయ స్వామి, పృథ్వీ వంటి మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలను చిరంజీవి పోషించారు.

విభిన్నమైన పాత్రలను పోషించడానికి రెడీగా ఉండే చిరంజీవి..ఇందులో తన పాత్రలోని వేరియేషన్స్ తో జనాలను మెప్పించాడు. ఇక త్వరలో విడుదల కాబోయే పొలిటికల్ డ్రామా ‘గాడ్ ఫాదర్’ లో చిరంజీవి తన నట విశ్వరూపం చూపిస్తారని మేకర్స్ అంటున్నారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తు్న్న ఈ పిక్చర్ కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.