సినీ తారల సీక్రెట్‌ బ్లాక్‌ వాటర్‌.. ఎందుకు అంత డిమాండ్‌ ఉందో తెలుసా..?

-

బ్లాక్‌ కాఫీ గురించి మనకు తెలిసిందే.. ఈ మధ్య బ్లాక్‌ వాటర్‌ పేరు కూడా బాగా వినిపిస్తుంది. సినీతారలంతా ఈ బ్లాక్ వాటర్‌ను బాగా తాగుతున్నారు. చూడటానికి నల్లగా కషాయం మాదిరిగా కనిపించే ఈ హెల్తీ డ్రింక్‌లో అంతలా ఏం ఉన్నాయనో..సినీ, క్రీడా ప్రముఖులంతా ఎగబడి తాగుతున్నారు. మొదటిసారి ఈ బ్లాక్‌ వాటర్ పేరు బాగా ప్రాచుర్యంలోకి బాలివుడ్ యాక్టర్‌ మలైకా అరోరా కారణంగానే. ఆ తర్వాత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఊర్వశి రౌతేలా, శ్రుతి హాసన్, కాజల్‌ అగర్వాల్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే చాన్తాడంత లిస్ట్‌ ఉంది..వీళ్లంతా ఈ వాటర్ను ఇంతలా తాగడంతో సామాన్యుల దృష్టి కూడా ఈ బ్లాక్‌ వాటర్‌పై పడింది. ఈ డ్రింక్ లోని మర్మమేమిటో తెలుసుకుందామా..

సాధారణంగా మనం తాగే మంచినీళ్లలో PH ( హైడ్రోజన్ ఇయాన్స్) స్థాయి 7 ఉంటే.. ఈ బ్లాక్ వాటర్‌లో అంతకుమించి ఉంటుందట. అలాగే బాడీని హైడ్రేటెడ్‌గా, ఫిట్‌గా ఉంచటంలో ఈ బ్లాక్ వాటర్ మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు…ఇందులో ఉండే 70 శాతం ఖనిజాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణప్రక్రియని మెరుగుపరుస్తాయి.

ఈ నీరు తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, జీర్ణశయాంతర ప్రేగు సమస్యలు దూరమవుతాయి. బ్లాక్‌ వాటర్‌ తాగడం వల్ల చర్మం కూడా మెరుస్తుంది. చర్మం పొడిబారదు. జుట్టు రాలడం తగ్గిపోతుంది. ఎనర్జిటిక్‌గా ఉంటారు. మెదడు పనితీరు మెరుగుపడుతుందని, ఏకాగ్రత పెరుగుతుంది.. వామ్మో ఇన్ని లాభాలు ఉన్నాయా..! అలా అని అదేపనిగా తాగొద్దంటున్నారు నిపుణులు…

అతిగా వద్దు…

మనం రోజూ తీసుకునే నీటిలో సాధారణంగా ఇన్ ఆర్గానిక్ సాల్ట్స్ ఉంటాయి. అయితే బ్లాక్ వాటర్‌లో నీరు ఎక్కువ ఆల్కలీన్‌గానే ఉంటుంది. వేసవిలో ఈ నీటిని ఎక్కువగా తీసుకుంటే.. సన్‌స్ట్రోక్‌ నుంచి బయటపడవచ్చు. ఇది శరీర వేడిని తగ్గిస్తుంది. అలాగే రక్తపోటును అదుపులో ఉంచడం, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కానీ ఈ బ్లాక్‌ వాటర్‌ను మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం కొన్ని సమస్యలు తప్పవు. ఒక్కోసారి వాంతులు కూడా రావొచ్చు. ఆరోగ్య నిపుణులు సూచించిన మోతాదులోనే బ్లాక్‌ వాటర్‌ ను తీసుకోవాలి. ఈ వాటర్‌ లీటర్‌ కాస్ట్‌ రూ. 500 పైనే ఉంది మరీ..! ఇంట్రస్ట్‌ ఉంటే మీరు ట్రే చేయండి.!
Attachments area

Read more RELATED
Recommended to you

Latest news