Dasara : “దూమ్ ధాం దోస్తాన్ ” అంటూ వచ్చేసిన నాని

-

నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘అంటే సుందరానికీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. జనాలను ఎంటర్ టైన్ చేయడంలో ఎప్పుడు ముందుండే నాని ఈ సినిమా ద్వారా కూడా ఎంటర్ టైన్ చేశాడు. ఇక ఇప్పుడు నాని తన నెక్స్ట్ ఫిల్మ్ ‘దసరా’పైన ఫుల్ ఫోకస్ పెట్టేశాడని తెలుస్తోంది. సింగ‌రేణి బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ‘మహానటి’ కీర్తి సురేశ్ ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ పిక్చర్ షూటింగ్ 90 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

 

ఈ మూవీకి సంతోష్ నారాయ‌ణ‌న్‌, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక తాజాగా ఇవాళ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ టీజర్ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. ధూమ్ దాం దోస్తాన్ అంటూ సాగే ఈ సాంగ్ ను దసరా రోజు రిలీజ్ చేస్తామని చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news