ఆర్‌ఆర్‌ఆర్‌ బిగ్గెస్ట్‌ అనౌన్స్‌ మెంట్‌ : దోస్తీ సాంగ్‌ రిలీజ్‌

టాలీవుడ్‌ ఒక్కటే కాదు.. వరల్డ్‌ వైడ్‌ గా ఎదురు చూస్తున్న బిగ్గేస్ట్‌ మూవీ ఆర్ఆర్ఆర్. ద‌ర్శక ధీరుడు రాజ‌మౌళి తీస్తున్న మూవీ కావ‌డంతో అంచ‌నాలు ఆక‌శాన్ని తాకుతున్నాయి. ఇక ఇందులో తొలిసారి ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, పోస్టర్లు భారీ హైప్ ను పెంచేశాయి. ఇది ఇలా ఉండగా.. అయితే…మూడు రోజుల కింద ఓ బిగ్‌ అనౌన్స్‌ మెంట్‌ వస్తుందని ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ టీం. ఈ మూవీలోని తొలి పాటను ఆగస్టు 1 న ఉదయం 11 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. అయితే…ముందుగా ప్రకటించిన సమయానికే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం… ఫస్ట్‌ సాంగ్‌ ను రిలీజ్‌ చేసింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ ను ట్విట్టర్‌ వేదికగా… ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఐదు భాషల్లో అంటే… తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడలో ఈ ఫస్ట్‌ సాంగ్‌ ను రిలీజ్‌ చేసింది. ఇక ఈ సాంగ్‌ దోస్తీ పేరుతో సాగుతోంది. తెలుగులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ పాటను హేమ చంద్ర పాడగా… కీరవాణి మ్యూజిక్‌ అందించారు.