నెవర్ బిఫోర్ అవతార్..‘విక్రమ్’లో మరోసారి కమల్ హాసన్ నట విశ్వరూపం

-

విశ్వనటుడు కమల్ హాసన్ నటన గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూనివర్సల్ స్టార్ గా పేరు గాంచిన ఈయన..ఇటీవల కాలంలో రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలూ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘విక్రమ్’. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపైన బోలెడన్ని అంచనాలున్నాయి.

‘విక్రమ్’ ఫిల్మ్ నుంచి విడుదలైన టీజర్..పిక్చర్ పై అంచనాలను ఇంకా పెంచేసింది. కమల్ హాసన్ ఓన్ ప్రొడక్షన్ హౌజ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ ఫిల్మ్ లో కమల్ హాసన్ తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘ఖైదీ, మాస్టర్’ ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మూవీ స్టోరి లైన్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నదని టాక్. ఈ నెల 15న పిక్చర్ ట్రైలర్ తో పాటు ఆడియోను విడుదల చేయనున్నారు. మూవీ ఈ ఏడాది జూన్ 3న విడుదల కానుంది. సినిమా స్టోరి లైన్ ప్రకారంగా..కమల్ హాసన్ ‘రా’ ఏజెంట్ గా కనబడుతారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news