సంక్రాంతి బరిలో తండ్రీ తనయుల సినిమాలు..నెగ్గేది రామ చరణా? చిరంజీవినా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కాగా, చిరంజీవి నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫుల్ ఫోకస్ తో అభిమానులు, ఆడియన్స్ ను అలరించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిరు-బాబీల కాంబో మూవీ MEGA 154(వాల్తేరు వీరయ్య) రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు మేకర్స్.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా MEGA 154 రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. అయితే, ఈ సంక్రాంతి బరిలో ఇప్పటికే ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్-రామ్ చరణ్ కాంబో పాన్ ఇండియా ఫిల్మ్..RC 15 సంక్రాంతి బరిలో ఉంది.

mega 154
mega 154

అలా తండ్రీ తనయుల సినిమాలు బరిలో ఉన్న నేపథ్యంలో ఇద్దరిలో నెగ్గేదెవరు? అన్న చర్చ జరుగుతున్నది. అయితే, రెండు సినిమాలూ విజయవంతం కావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, ఈ సంక్రాంతి సినిమాల పండుగేనని అంటున్నారు సినీ పరిశీలకులు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’, ఇళయ తలపతి విజయ్ ‘వారసుడు’ కూడా సంక్రాంతి బరిలోనే ఉంటుండటం విశేషం.