ఆర్జీవి మిస్సింగ్..వర్మ కన్నింగ్ పాలిటిక్స్ మాములుగా లేవుగా…!

-

గత కొంతకాలంగా పొలిటికల్ లీడర్లపై సినిమాలు చేస్తే అందరిని తనవైపుకు తిప్పుకుంటున్నాడు.తాజాగా ఆర్జీవి మిస్సింగ్ పేరుతో మరో సినిమాను అనౌన్స్ చేశాడు. నిత్యం ఏదో ఒక రచ్చ చేయందే వర్మకి పొద్దు పోదు. తాజాగా ఆర్జీవి మిస్సింగ్ తో అలాంటి దూమ్ దామే చేసే ప్రయత్నమే చేశాడు.ఐతే ఈసారి వేసిన ఈ ట్రైల్ ను ఎవ్వరు పెద్దగా పట్టించుకోలేదు.రొటీన్ కామెడీయే కదా అంటున్నారంతా. ఆర్జీవి మిస్సింగ్ లో దాగిన వర్మ కన్నింగ్ పాలిటిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.


ఆర్జీవి మిస్సింగ్ లో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు.ఇందుల్లో తాను మిస్ అయిన ఘటనను తెలియజేస్తూ కొందరిని అనుమానితులుగా పేర్కొన్నాడు.దానిలో భాగంగా పవర్ ఫుల్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, పప్పు అని పిలవబడే ఆయన కుమారుడు అనుమానితులు అని పేర్కొన్నాడు. ఇక్కడితే సరిపెట్టకుండా ప్రపంచంలోనే మొదటిసారిగా వస్తున్న ఫిక్షనల్ రియాలిటీ సినిమా అంటూ కలరింగ్ ఇచ్చాడు.

ఆర్జీవి మిస్సింగ్ ఫస్ట్ లుక్ లో రాము చేతులకి బేడీలు వేసున్నాయి.ఈ లుక్ రాము ఎంతో ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ… తనకి తానే ‘అమాయకమైన బాధితుడు’ అని ప్రకటించుకున్నాడు.ఇక ఈ సినిమాకి సంబంధించిన రెండో లుక్ ని అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేసాడు.మరి ఇందులో కూడా ఏదో చెబుదామని ఇంకేదో చూపిస్తున్నాడు.ఇక ఈ ఫిలింలో వర్మనే నటిస్తాడా లేక మరెవరైనా నటిస్తారా అన్నది చూడాలి .ఈ పిక్చర్ ను కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చటర్జీ నిర్మిస్తుండగా అదిర్ వర్మ డైరెక్షన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news