బలగం మొగిలయ్య మళ్లీ ఆస్పత్రి పాలయ్యాడు. బలగం మొగిలయ్య కిడ్నీ వ్యాధితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు.
ఆయనని ఆదుకుంటామని గత ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బలగం మొగిలయ్యను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. నిన్న బలగం మొగిలయ్య మళ్లీ ఆస్పత్రి పాలయ్యాడు. ఈ తరుణంలోనే…తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బలగం మొగిలయ్య భార్య కోరుతున్నారు. ఎవరైనా సహాయం చేయాలని వేడుకుంటున్నారు.