జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో మాదిరి ఏపి లోను ఫోన్ ట్యాపింగ్ జరిగిందని జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఆరోపణలు చేశారు.

ఏపీ సర్కార్ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధుల ఫోన్లను, వారి వ్యక్తిగత సంభాషణలను వైసీపీ ప్రభుత్వం రికార్డ్ చేసిందని ఆరోపణలు చేశారు. ఆ ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా నాయకులు మీద ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందన్నారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్. వైసీపీ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్.