అంతటి చేదు జ్ఞాపకాన్ని మరచి.. మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనున్న నాగబాబు..

-

రామ్ చరణ్ జెనీలియా నటించిన ఆరెంజ్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది ముఖ్యంగా ఈ సినిమా వల్ల నిర్మాత నాగబాబు నష్టపోయి అప్పుల పాలయ్యారు ఇది తన జీవితంలో ఓ చేదు జ్ఞాపకం అంటూ పలుమార్లు చెప్పుకొచ్చిన ఆయన మళ్లీ ఆ సినిమాను రి రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు..

 

మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు రామ్ చరణ్ కు మగధీర లాంటి బ్లాక్బస్టర్ హిట్ వచ్చిన తర్వాత నటించిన ఆరెంజ్ సినిమా నిర్మాతగా నాగబాబుకు ఏ రకంగా కలిసి రాకపోగా అప్పులు ఊబిలో మునిగిపోయేటట్టు చేసింది.. అయితే దీనివల్ల అతను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది జరిగి 12 ఏళ్ల అయినప్పటికీ దాని తాలూకు ప్రభావం అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్న.. మళ్లీ ఆ సినిమాను రీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు..

మెగా బ్రదర్స్ లో నాగబాబుకు ఈ రకంగానూ అదృష్టం కలిసి రాలేదు. తన ఫ్యామిలీలో ఇంతమంది స్టార్ హీరోలు ఉండి కూడా నిలదక్కుకోలేకపోయారు.. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో చిరంజీవితో సినిమాలు చేశాడు. చిరంజీవి కాల్షీట్స్ ఇస్తే కాసులే అన్న రోజుల్లో.. చిరంజీవితో నాగబాబు నిర్మించిన రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు ఫ్లాప్ అయ్యాయి. బావగారు బాగున్నారా మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ బడ్జెట్ తో తీసిన ఆ సినిమా ఏ మాత్రం లాభాలు తెచ్చినట్లు లేదు.

తర్వాత పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ మూవీ చేస్తే అట్టర్ ప్లాప్ అయ్యింది.. ఇలా కాదని రామ్ చరణ్ తో ఆరంజ్ మూవీ చేశాడు. అయితే మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ కు ఆరెంజ్ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది దీంతో ఉన్న ఆస్తులు మొత్తం పోగొట్టుకొని నాగబాబు రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ సమయంలో అన్నదమ్ములిద్దరూ ఆదుకోవడంతో కొంతవరకు నిలదక్కుకున్న తర్వాత టీవీ షో లతో ఆర్థికంగా పర్వాలేదు అనిపించుకునే స్థాయికి వచ్చారు..

Read more RELATED
Recommended to you

Latest news