ఈ వీకెండ్ సినీ ప్రియులను ఓటీటీ వేదికలు ఆకట్టుకోనున్నాయి. సబ్‌స్క్రిప్షన్ లేకుండా కొన్ని సినిమాలను ఫ్రీగా చూసే ఛాన్స్‌ను ఇస్తున్నాయి కొన్ని ఓటీటీ సంస్థలు. మరి ఇంతకీ ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటి..? ఆ ఉచిత సినిమాలు ఏంటి..? ఓసారి తెలుసుకుందామా..?
జియో సినిమా ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా కొన్ని చిత్రాలను ఫ్రీగా చూసే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పించింది. హృతిక్ రోషన్-సైఫ్ అలీఖాన్ నటించిన ‘విక్రమ్ వేద’ (హిందీ, బెంగాలీ, మరాఠీ), వరుణ్‌ధావన్- కృతిసనన్ నటించిన ‘భేదియా’ (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం), రాధిక – రజత్ నటించిన ‘కచ్చేయ్ లింబు’ (కేవలం హిందీ), హృదు హరూన్, బాబీ సింహా నటించిన ‘థగ్స్’ (తెలుగు, తమిళం, హిందీ)తోపాటు శనివారం విడుదల కానున్న రకుల్‌ప్రీత్‌సింగ్, విశ్వక్‌సేన్ నటించిన ‘బూ’ చిత్రాన్ని సైతం సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా వీక్షించవచ్చు.
ఆహా ‘సమ్మర్ బాక్సాఫీస్’ పేరుతో రోజూ ఓ చిత్రాన్ని ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఏ రోజు ఏ సినిమా ఉచితంగా చూడొచ్చు అనే విషయాన్ని ఆహా తన ట్విటర్ ఖాతా వేదికగా ఉదయాన్నే అప్‌డేట్ ఇస్తుంది.