రామ్ చరణ్ కు ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం rc 15 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు రామ్ చరణ్. అయితే తాజాగా ఈ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

జాతీయస్థాయిలో ప్రముఖ టెలివిజన్ ఛానల్ ఎన్ డి టీవీ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కార్యక్రమంలో ట్రూ లెజెండ్ అవార్డు తో రామ్ చరణ్ ను సత్కరించారు. ఈ అవార్డు అందుకున్నానంతరం రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి బ్లడ్ బ్యాంక్ పెట్టడం వెనుక విషయాన్ని పంచుకుంటూ… ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇటు రామ్ చరణ్ ఈ అవార్డు అందుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. రామ్ చరణ్ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమని చిరు తెలిపారు.