రేవ్‌ పార్టీలో హీరో గల్లా అశోక్‌ అరెస్ట్‌..గల్లా ఫ్యామీలీ క్లారిటీ

హైదరాబాద్‌ మహానగరంలోని పబ్‌ లపై నిన్న రాత్రి పోలీసులు వరుసగా దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే.. నిన్న నగరంలో నిర్వహించిన రేవ్‌ పార్టీని కూడా పోలీసులు భగ్నం చేసినట్లు తెలుస్తోంది. రాడిసన్‌ బ్లూ హోటల్‌ పై టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు ఒక్క సారిగా దాడులు చేశారు.

హోటల్ లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్ అర్దరాత్రి దాటిన సమయానికి మించి పబ్ నడుపుతున్నట్లు గుర్తించిన టాస్క్‌ ఫోర్స్‌… యజమానులతో సహా సుమారు 150మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో గల్లా జయదేవ్‌ కుమారుడు అయిన గల్లా అశోక్‌ ఉన్నారని ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై గల్లా కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

“నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో గల్లా అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీ మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.” అంటూ గల్లా కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు.