ఈ ఆకులతో మహిళల్లో చాలా సమస్యలు తొలగించొచ్చు..!

-

మెడిసినల్ గుణాలు ఉండే ఆకులు, చెట్లు మన చుట్టూ చాలా ఉంటాయి. నిజానికి వీటి వల్ల చాలా లాభాలు మనం పొందవచ్చు. ముఖ్యంగా మహిళల్లో కలిగే పీరియడ్ సమస్యలు, థైరాయిడ్, జుట్టు రాలిపోవడం, ఒత్తిడి, వీక్నెస్ మొదలైన సమస్యలను ఈ ఆకులతో తొలగించుకోవచ్చు.

 

అయితే మరి ఏ ఆకుల వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. నిజానికి చిన్న చిన్న సమస్యలు కూడా వీటి ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు.

కరివేపాకు:

కరివేపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గర్భిణిలు కరివేపాకును తీసుకోవడం వల్ల వికారం, వాంతులు సమస్యలు తగ్గుతాయి. అలాగే కరివేపాకు ఆకులతో టీ చేసుకుని తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి ఉండదు.

మందార ఆకులు:

మందార ఆకులు జుట్టు రాలిపోవడాన్ని ఆపుతుంది మందార ఆకులతో చేసిన టీ చేసుకుని తీసుకుంటే కడుపు నొప్పి, హెవీ బ్లీడింగ్ వంటి సమస్యలు ఉండవు.

తులసి ఆకులు:

ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కడుపునొప్పి, వాంతులు,
క్రామ్ప్స్ వంటి సమస్యలను కూడా తులసి పోగొడుతుంది.

వేప ఆకులు:

వేపాకులు కూడా మహిళలకు చాలా బాగా పనిచేస్తాయి. చర్మ సమస్యల్ని, ఒబేసిటీని దూరం చేస్తుంది.

కొత్తిమీర:

ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో సమస్యలు తొలగిస్తుంది కొత్తిమీర. థైరాయిడ్ సమస్యలను తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి వెన్నునొప్పి ఉంటే కొత్తిమీర తో మాయం చేసుకోవచ్చు. ఇలా ఈ ఆకుల వల్ల ఇన్ని లాభాలని మహిళలు పొందొచ్చు. దానితో సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news