గాడ్ ఫాదర్: లూసిఫర్లో లేని అంశాలు ఇవే.!!

-

గతంతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రీమిక్స్ సినిమాల హవా ఎక్కువైంది. ఎంతోమంది పెద్దపెద్ద స్టార్ హీరోలు కూడా ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తూ ఇక్కడ మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇక అలాంటి వారిలో సీనియర్ హీరోలు రీమేక్ చిత్రాలకి పెద్దపీట వేస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోని మెగాస్టార్ చిరంజీవి మలయాళం మూవీ అయిన లూసిఫర్ తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ కి, లూసిఫర్ సినిమాకి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయని ప్రేక్షకులు కూడా చెబుతున్నారు.

God father vs Lucifer trolls started in social media
వాటిలో ముందుగా గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డైలాగ్స్, లుక్స్ విషయంలో చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ఇక అభిమానులు కూడా ఎక్కడా నిరాశ పడకుండా జాగ్రత్త పడింది. ఇకపోతే మెగాస్టార్ సినిమా అంటే ఎక్కడో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. ఇక అందుకు తగ్గట్టుగానే కథలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా యాడ్ చేశారు. మెగాస్టార్ సినిమా అంటే పవర్ఫుల్ డైలాగులను కూడా అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక ఈ క్రమంలోనే వారి అభిరుచికి తగ్గట్టుగా.. ఆల్రెడీ ఇప్పటికే రాజకీయాలకు దూరం అయ్యాను అని మెగాస్టార్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి.

అదే సమయంలో ఇక మంచి కంటెంట్ ఉన్న లూసిఫర్ సినిమాను ఎలా తీస్తారు అని అందరూ భయపడినప్పటికీ ప్రేక్షకులు ఊహించిన దానికంటే మోహన్ రాజా చాలా బాగా చేశాడు . ఇక ఈ క్రమంలోనే అభిమానులు అందరూ కూడా సాటిస్ఫై అయి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ను అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news