బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పుష్ప 3 కూడా..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఎంత పాపులారిటీ దక్కించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను నార్త్ లో పెద్దగా ప్రమోట్ చేయకపోయినా సరే ఈ సినిమాకు అక్కడ కూడా మంచి బజ్ లభించింది. మరొకవైపు ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే 2021లో విడుదలైన పుష్ప సినిమాలో రష్మిక కథానాయకగా నటించింది. ఇకపోతే సినిమా తారల నుంచి క్రికెటర్స్ వరకు ఈ సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజంకి ఫిదా అయిపోయారు.

ఇక ఈ సినిమా సీక్వెల్ 2024 మే లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒడిస్సా లోని ఒక అటవీ ప్రాంతంలో ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఇప్పుడు మరొక రూమర్ బయటకు రావడం గమనార్హం. త్వరలోనే పుష్ప 3 కూడా రాబోతోందని సుకుమార్ ఫ్రాంచైజీ గా చేయాలని ఉద్దేశంతో పుష్ప 3 ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మావెరిక్ చిత్ర నిర్మాత భాగానికి పుష్ప 3 ది రూల్ బిగిన్స్ అని పేరు పెట్టారు అంటూ ప్రచారం జరుగుతుంది.

ఇకపోతే నటుడు ఫహాధ్ ఫాజిల్ కూడా పుష్ప 3 ఉంటుందని గతంలో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది కేవలం పుకారు మాత్రమేనా? లేక ఉందా అనేది తెలియాలి అంటే ఇక మేకర్స్ నుంచి ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే ..ఒకవేళ ఇదే నిజమైతే ఇక అభిమానుల ఆనందదానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. ఇప్పటివరకు తెలుగులో ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి కానీ ఇలా త్రీక్వెల్ రావడం జరగలేదు. ఇక ఇదే నిజమైతే ఈ సినిమా మరో అరుదైన రికార్డును సృష్టిస్తుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news