ఏపీ విద్యార్థులకు అలర్ట్.. మే 28 నుంచి AP PGECET

-

ఏపీ విద్యార్థులకు అలర్ట్.. రాష్ట్రంలోని ఎంటెక్, ఎం ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే AP PGECET (ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షలు మే 28న ప్రారంభం కానున్నాయి. మే 30 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి.

అర్హులైన వారు ఈ నెల 30 లోపు లేట్ ఫీ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఓబీసీలకు రూ. 1200, బిసిలకు రూ. 900, ఎస్సీ, ఎస్టీలకు రూ. 700 గా ఉంది. లేట్ ఫీతో మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, AP EAPCET లో ఇంటర్ మార్కులకు ఈ ఏడాది వెయిటేజీ ఇవ్వనున్నారు.

 

కరోనా వల్ల గతంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో వెయిటేజీ తొలగించగా, ఈ ఏడాది 25% ఇంటర్ మార్కుల వెయిటేజీని పునరుద్ధరించారు. EAPCET లో వచ్చే 75%, ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి ర్యాంకులకి కేటాయిస్తారు. ఇంటర్ లో ఎస్సీ, ఎస్టీలకు 40%, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరి. కాగా, తెలంగాణలో వెయిటేజిని పూర్తిగా తొలగించి ఎంసెట్ ర్యాంకులు కేటాయిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news