Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌‌కు ప్రశాంత్ నీల్ సర్‌ప్రైజ్‌..థియేటర్స్‌లో ‘సలార్’ ట్రైలర్

-

‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ ఫిల్మ్ తెరకెక్కుతుండగా, అందుకు సంబంధించిన ట్రైలర్ ను ఏకంగా థియేటర్స్ లో రిలీజ్ చేశారు. గురువారం ‘కేజీఎఫ్ చాప్టర్2’ రిలీజ్ కానుంది. కాగా, ఒక రోజు ముందే బుధవారం నుంచి థియేటర్స్ లో ‘సలార్’ ట్రైలర్ విడుదల చేశారు.

‘సలార్’ ట్రైలర్ చూసి అభిమానులు సంతోష పడుతున్నారు. ఈ సారి బాక్సాఫీసు రికార్డులు బద్ధలే అని అంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన గత చిత్రం ‘రాధేశ్యామ్’ లవ్ స్టోరి అయిన నేపథ్యంలో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. కాగా, ఈ సారి అలా ఉండబోదని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. మోస్ట్ వయ్ లెంట్ మ్యాన్ గా ప్రభాస్ కనబడబోతున్నారు. ట్రైలర్ లో శ్రుతిహాసన్ లుక్ కూడా అదిరిపోయింది.

మొత్తంగా ప్రశాంత్ నీల్ ప్రభాస్ అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ గా ‘సలార్ ’ఇంట్రడక్షన్ ట్రైలర్ అయితే ఇచ్చేశారని చెప్పొచ్చు. ఈ చిత్రంలో భారీ తారాగణమే ఉంది. ఇప్పటికే సినిమా 50 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది.

తెలంగాణలోని రామగుండం, గోదావరి ఖని ప్రాంతాల్లో ప్రశాంత్ నీల్ ప్రభాస్-శ్రుతిహాసన్ ఇతర నటీనటులపై ఓషెడ్యూల్ షూట్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో మేకర్స్ ప్లాన్ చేస్తారని సమాచారం. ‘కేజీఎఫ్’ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పైన ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టైలిష్ విలన్ జగపతిబాబు చిత్రంలో  కీలక పాత్ర పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news