ఏపీలో దారుణం… చెల్లిపై ఓ యువకుడు అత్యాచారం..బాధితురాలికి 9 నెలల గర్భం !

-

సొంత చెల్లిపై ఓ అన్న లైంగిక దాడి చేసి..గర్భవతిని చేశాడు. ఏపీలో దారుణంలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని ఓ ఎస్టీ కాలనీకి చెందిన దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. గొడవల కారణంగా కొన్నేళ్ల కిందట భార్య భర్తలు విడిపోయారు. ఈ నేపథ్యంలో.. భర్త వదిలేసిన ఓ మహిళకు ఆ వ్యక్తి దగ్గరయ్యాడు.

మొదటి భార్త వల్ల అప్పటికే ఆ మహిళకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఇరువురూ తమ పిల్లలతో ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు. ఆ వ్యక్తికి 20 ఏళ్‌లున్న పెద్దకుమారుడు, 12 ఏళ్ల వయసు ఉన్న ఆ మహిళ కుమార్తె పై కన్నేశాడు. సవతి తల్లి కుమార్తె పై అతడు చేసిన అఘాయిత్యం వల్ల ఆ బాలిక గర్భం దాల్చింది.

బాలికకు నాలుగు నెలల గర్భం వచ్చినప్పుడే విషయం తల్లి దండ్రులకు తెలిసింది. 9 నెలలు పూర్తి అయ్యాక బాలిక తల్లి ప్రసవం కోసం నెల్లూరు ఆస్పత్రికి సోమవారం తీసుకెళ్లింది. చిన్న వయసులోనే గర్భం దాల్చడంపై వైద్యులకు అనుమానం తలెత్తింది. వారు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసుల విచారణలోబాలిక తల్లి జరిగిన విషయాలన్నీ చెప్పింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news