ఆగస్టు నుంచి నాన్ స్టాప్ గా గోపీచంద్ తమన్నా ల “సీటీమార్” షూటింగ్…!

-

మాస్ హీరో గోపీచంద్ తమన్నా భాటియా హీరో హీరోయిన్స్ గా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “సీటీమార్‌”. క‌బ‌డ్డీ ఆట నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ జరుపుకుంది.

 

అయితే లాక్ డౌన్ తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ని తిరిగి ‌ఆగ‌స్ట్ మొద‌టివారం నుండి షూటింగ్ మొద‌లుపెట్టి నాన్ స్టాప్ గా సింగిల్ షెడ్యూల్‌లో సినిమాని కంప్లీట్ చేయ‌డానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన గోపీచంద్ తమన్నా లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్ గా గోపిచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా త‌మ‌న్నా న‌టిస్తున్నారు. మరో ప్ర‌త్యేక పాత్ర‌లో దిగంగ‌న న‌టిస్తుండ‌గా ఇతర ముఖ్య‌మైన పాత్ర‌ల్లో పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత అందిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే నాలుగు పాట‌లు రికార్డ్ చేశారట. ఇక ఈ మద్య కాలంలో గోపీచంద్ కి మంచి హిట్ దక్కలేదు. దాంతో ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తమన్నా మొదటిసారి గోపిచంద్ సరసన నటిస్తుండటం కూడా సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news