గోపీచంద్.. ‘చాణక్య’ ఫస్ట్ లుక్ వచ్చేసింది..!

స్పై థ్రిల్ల‌ర్‌గా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. తెలివికి మారుపేరుగా చాణ‌క్య‌ని పోలుస్తారు. మ‌రి ఇందులో గోపీచంద్ స్పైగా ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూ ప్ర‌త్య‌ర్థులను మ‌ట్టు పెడ‌తాడ‌ని అర్థ‌మ‌వుతుంది. ఇంట‌లిజెంట్ పాత్ర‌లో గోపీచంద్ క‌నిపించ‌బోతున్నార‌ని చెప్పొచ్చు.

గోపీచంద్ తాను ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌టించిన 25వ చిత్రం పంతంతో భారీ ప‌రాజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. జిల్ తర్వాత వ‌రుస‌గా నాలుగో ఫ్లాప్ సినిమా ఇది. ఈ సినిమా నూత‌న ద‌ర్శ‌కుడు చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విష‌యం తెలిసిందే. తాజాగా త‌న 26వ సినిమాని తిరు ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. పంతం త‌ర్వాత మ‌రోసారి ఈ ఇద్ద‌రు జోడీ క‌డుతున్న చిత్ర‌మిది. ఈ సినిమాకి చాణ‌క్య అని ఆస‌క్తిక‌ర టైటిల్ పెట్టారు.

స్పై థ్రిల్ల‌ర్‌గా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. తెలివికి మారుపేరుగా చాణ‌క్య‌ని పోలుస్తారు. మ‌రి ఇందులో గోపీచంద్ స్పైగా ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూ ప్ర‌త్య‌ర్థులను మ‌ట్టు పెడ‌తాడ‌ని అర్థ‌మ‌వుతుంది. ఇంట‌లిజెంట్ పాత్ర‌లో గోపీచంద్ క‌నిపించ‌బోతున్నార‌ని చెప్పొచ్చు.

తాజాగా ఇవాళ గోపీచంద్ బర్త్‌డే సందర్భంగా చాణక్య ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో గోపీచంద్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. గుంపులో నుంచి ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా.. బాధతో ఉన్నట్టుగా కనిపిస్తాడు గోపీచంద్. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.