బ్రేకింగ్ న్యూస్‌: రోజాకు పెద్ద ప‌ద‌వి ఇచ్చిన జ‌గ‌న్‌?

తనకు మంత్రి పదవి దక్కనందుకు తనకు ఏమాత్రం బాధలేదని రోజా మీడియా ముందు తెలిపారు. నిన్న జగన్‌ను కూడా మీట్ అయ్యారు. కాకపోతే.. జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని ఆమె మీడియాకు చెప్పినప్పటికీ.. తనకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని జగన్ యోచిస్తున్నారట.

ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారు అనే ఎంత ఖాయమో… రోజా కూడా మంత్రి అవుతారు అనేది అంతే ఖాయంగా మొన్నటిదాకా ఉండేది. అయితే.. సీఎం జగన్.. కేబినేట్‌లో రోజాకు చోటు కల్పించలేదు. దీంతో రోజా అలిగారని వార్తలు వచ్చాయి.

అయితే.. తనకు మంత్రి పదవి దక్కనందుకు తనకు ఏమాత్రం బాధలేదని రోజా మీడియా ముందు తెలిపారు. నిన్న జగన్‌ను కూడా మీట్ అయ్యారు. కాకపోతే.. జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని ఆమె మీడియాకు చెప్పినప్పటికీ.. తనకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని జగన్ యోచిస్తున్నారట.

అందులో భాగంగానే ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా రోజాను నియమించాలని జగన్ నిర్ణయించారట. అయితే.. దీనిపై అటు ఏపీ ప్రభుత్వం నుంచి కానీ… రోజా నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చూద్దాం.. మరి నిజంగా జగన్… రోజాకు ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పదవిని కట్టబెడతారా? లేక వేరే పదవి ఇస్తారా?