కేసీఆర్ ప్రారంభించనున్న ఆ పథకానికి జగనే చీఫ్ గెస్ట్?

-

ఆ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారట. ఆయన్ను ఆహ్వానించేందుకు కేసీఆర్ త్వరలోనే విజయవాడ వెళ్లనున్నారట.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఆవిష్కరణకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని చీఫ్ గెస్ట్‌గా పిలవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. కాళేశ్వరం ప్రాజెక్టు పనులన్నీ పూర్తికావచ్చాయి. ఈ నెల చివర్లోనే లేక వచ్చే నెల నుంచో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయనున్నారు. ఈసందర్భంగా ప్రాజెక్టును జూన్ 21న ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించనున్నారు. అయితే.. ఆ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారట. ఆయన్ను ఆహ్వానించేందుకు కేసీఆర్ త్వరలోనే విజయవాడ వెళ్లనున్నారట. అయితే.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించాక.. జగన్.. ముందుగా గవర్నర్‌ను కలిసి.. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌నే కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా కేసీఆర్ వెళ్లారు. తర్వాత గవర్నర్‌తో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు భేటీ అయి.. రెండు రాష్ర్టాల అభివృద్ధికి తోడ్పాడునందిస్తామని హామీ ఇచ్చారు. ఇరు రాష్ర్టాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని ఆకాంక్షించారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్.. జగన్‌ను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news