రామ్ చరణ్ ను చూసి ఫిదా అయిన హలీవుడ్ నటి..!!

-

రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో ఉత్తరాది ప్రేక్షకులు అందరూ రామ్ చరణ్ లో శ్రీరాముడు ను చూసుకొని మురిసిపోయారు. ఇక ఆ తర్వాత రాజమౌళి ఈ సినిమా ను ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేస్తూ మరింత పేరు తీసుకొని వచ్చేలా చేస్తున్నాడు. దానితో రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ లు హలీవుడ్ ప్రేక్షకులకు ఇపరీతంగా నచ్చుతున్నారు. అలాగే ఈ సినిమా ఆస్కార్ అవార్డు రేసులో ముందుకు వెళుతూనే ఉంది.

రీసెంట్ గా  ఆర్ఆర్ఆర్ మూవీ పై నేడు ప్రముఖ హాలీవుడ్ నటి ఫ్రాన్సెస్ ఫిషర్ తన ట్విట్టర్ లో సినిమాని పొగుడుతూ ట్వీట్ చేశారు. ఆమె మరెవరో కాదు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం లో చాలా రోజుల క్రితం రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా ఎవరూ అందుకోలేని రికార్డ్స్ క్రియేట్ చేసిన టైటానిక్ మూవీలో హీరోయిన్ కేట్ విన్స్లెట్ తల్లి పాత్రలో నటించిన ప్రముఖ నటి. ఆమె తన ట్వీట్ లో  తనకు ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ నటన, డ్యాన్స్, ముఖ్యంగా పలు కీలక సీన్స్ లో పెర్ఫార్మన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉందని తన పోస్ట్ లో తెలిపారు ఫిషర్. కాగా ప్రస్తుతం ఆమె పెట్టిన ట్విట్టర్ పోస్ట్ ట్రెండింగ్ మారి విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో RC15 వర్కింగ్ టైటిల్ పై సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో భారీ ఎత్తున జరుగుతోంది. ఈ సినిమా  పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి శంకర్ మూవీ పూర్తి అయిన వెంటనే  బుచ్చి బాబుతో రామ్‌ చరణ్ సినిమాను చేసేందుకు రెడీ అవుతాడు. రామ్ చరణ్ సినిమాల లైనప్ సూపర్ గా గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news