పెళ్లి తర్వాత మరింత బోల్డ్ గా మారిన హన్సిక..!

-

గోవా బ్యూటీ హన్సిక గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఈమె పేరు తలుచుకోగానే ఈమె బొద్దు అందాలు కళ్ళముందు అలా తారసపడతాయి.. అందంగా, బొద్దుగా, ముద్దుగా కనిపించే హన్సిక అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఈమె అందానికి ఫిదా అయినా తమిళలో ఏకంగా ఆమె కోసం గుడే కట్టేశారు అంటే ఏ రేంజ్ లో ఆమెకు పాపులారిటీ ఉందా అర్థం చేసుకోవచ్చు. తమిళంలో స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన ఈమె ఒకవైపు సినిమాలలో నటిస్తూనే పోయిన ఏడాది తాను ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకుంది.

తెలుగులో ఈ అమ్మడికి స్టార్ హీరోల సరసన సరైన అవకాశాలు రాలేదని చెప్పాలి. అల్లు అర్జున్ దేశముదురు తరువాత ఎన్టీఆర్ కంత్రి మినహా పెద్ద హీరోల సరసన నటించలేదు. ఆ తర్వాత ఈమె కెరీర్ కు బ్రేకులు పడ్డాయని చెప్పాలి. కందిరీగ లాంటి సినిమా విజయం సాధించినా కూడా హన్సిక కెరియర్ మాత్రం అంతంతమాత్రంగానే నత్త నడకన సాగింది. ఆచార సాంప్రదాయాలతో గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈమె వివాహం తర్వాత మరింత బోల్డ్ గా మారిపోయింది. వరుస క్లీవేజ్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది . గతంలో బొద్దుగా , మందంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సన్నజాజి తీగను పోలి ఉంది చాలా స్లిమ్ముగా అంతకుమించి గ్లామర్ గా కనిపిస్తోంది హన్సిక.

ఇక అసలు విషయంలోకి వెళితే ఈమె ఇప్పుడు 8 సినిమాలు ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ క్రమంలోనే అభిమానులను ఆకట్టుకోవడానికి మరొకవైపు సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ ఫోటో షూట్ లను షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది .ఇకపోతే హన్సిక వివాహం తర్వాత తన బోల్డ్ ఫోటోషూట్లను బయట పెట్టడం అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తాజాగా వైట్ షర్ట్ , గోల్డెన్ స్కర్ట్ ధరించిన ఈమె నడుము అందాలతో పాటు థైస్ అందాలను చూపిస్తూ మరింత రచ్చ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news