హర హర వీరమల్లు టీజర్ ఎప్పుడంటే.. !

-

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం హరహర వీరమల్లు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సర్వ వేగంగా జరుగుతుంది. అయితే త్వరలోనే టీజర్ను విడుదల చేయనున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి దీనికి డేట్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది..

హర హర వీరమల్లు చిత్రం తెలుగుతోపాటు తమిళం హిందీ కన్నడ భాషలో ఒకే సమయంలో విడుదల కానుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ సినిమా టీజర్ జనవరి 26న విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది అయితే దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.. అలాగే ఈ టీజర్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ లో కొన్ని షాట్స్ చూపనున్నట్టు కూడా తెలుస్తోంది.

ఆల్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు. పీరియాడిక్ డ్రామాగా రానుంది ఈ సినిమా. పవన్ సినిమాల కంటే రాజకీయాల్లో బిజీ కావడం, హరి హర వీర మల్లు స్క్రిప్ట్‌లో మార్పులు చేయాల్సి రావడంతో షూటింగ్‌ చాలా ఆలస్యమైంది. అలాగే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా కాలం అయిపోయినప్పటికీ రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండి ఇంకా సబ్స్క్రైకి రావడం లేట్ అవుతూ వచ్చింది రీసెంట్గా మాత్రం రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేసినట్టు తెలుస్తుంది అలాగే ఈ సీన్స్ సినిమాకి హైలైట్ గా మారనున్నట్టు సమాచారం ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ బైక్ పైన రామోజీ ఫిలిం సిటీ లో రైడ్ చేయటం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని పవన్ కెరియర్ లో తిరుగులేని సినిమా అవుతుందంటూ చెప్పుకోస్తున్నారు.. హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news