Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్..నెవర్ బిఫోర్ గెటప్‌లో పవన్ కల్యాణ్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ పీరియాడిక్ రోల్ చేస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా ఫిల్మ్ గా రిలీజ్ కాబోతున్నది. మొఘలుల కాలం నాటి కథలో పవన్ కల్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి కాగా, మిగతా భాగం ఇప్పుడు జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ తాజాగా ఖరారు అయింది. అలనాటి కాలానికి తగ్గట్లు భారీ సెట్ వేయగా, అందులో షేట్ చేస్తున్నారు.

సోమవారం షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పవన్, క్రిష్ ఔట్ పుట్ చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా, సదరు ఫొటో నెట్టింట వైరలవుతున్నది.

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ గెటప్ చాలా కొత్తగా ఉండబోతున్నది. ఈ పిక్చర్ పై భారీ అంచనాలు నెలకొని ఉండగా, డెఫినెట్ గా సినిమా సూపర్ సక్సె్స్ అవుతుందని పవన్ కల్యాణ్ అభిమానులు అంటున్నారు. ఈ మూవీలో పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ నటిస్తోంది. మ్యూజిక్ ఎం.ఎం.కీరవాణి అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news