అల్లు అర్జున్ వ్యవహారం పై మాకు మైక్ ఇవ్వట్లేదు : హరీష్ రావు

-

అల్లు అర్జున్ వ్యవహారం పై సీఎం మాట్లాడారు. కానీ మాకు మైక్ ఇవ్వమంటే ఇవ్వలేదు అని హరీష్ రావు పేర్కొన్నారు. అయినా ఆ మహిళ చనిపోవడం దురదృష్టకరం. కానీ మీ సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ మీ తమ్ముడు పేరు రాసి చనిపోయారు. మీ తమ్ముడు ని ఎందుకు అరెస్ట్ చేయలేదు. వాంకిడి లో విద్యార్థిని శైలజ చనిపోతే ఎందుకు పరమర్శించలేదు. అసెంబ్లీ ని గాంధి భవన్ లాగా మార్చారు. పది సంవత్సరాలు గాంధీ భవన్ లో చెప్పిన విషయాలే ఇక్కడ చెబుతున్నారు. ఫార్ములా ఈ రేస్ మీద చర్చించాలి అని అడిగాము.. కానీ చర్చించలేదు.

మొదటి రోజు అసెంబ్లీ పెట్టి ఆరు రోజులు సెలవులు ఇచ్చారు. సోనియాగాంధీ బర్త్ డే అని డిసెంబర్ 9న అసెంబ్లీ పెట్టారు. ఆమె పుట్టిన సంవత్సరం 1947 నెంబర్ తో జీవో ఇచ్చారు. ఇలా బర్త్ డే ల కోసం అసెంబ్లీ ని పెడుతున్నారు. కోమటిరెడ్డి ఏమి మాట్లాడు తున్నారో అర్థం కావట్లేదు. కోమటిరెడ్డి ని కూర్చోమని మంత్రులు, స్పీకర్ చెప్పినా వినట్లేదు అని హరీష్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news