హబ్ద్ విజయ్ దేవరకొండ: డబ్బుల కోసం అప్పుడు తిప్పలు.. ఇప్పుడు కుప్పలు..!!

-

హబ్ద్ విజయ్ దేవరకొండ: రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై.. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. సినిమా చివర్లో చనిపోయి అందరి చేత కంటతడి పెట్టించిన ఈ యువ హీరో మొదటి హిట్ అందుకోవడమే కాదు.. ఈ సినిమా నేషనల్ ఫిలిం అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే ఈరోజు 34వ పుట్టినరోజు జరుపుకుంటున్న విజయ్ దేవరకొండ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గతం గురించి వెల్లడించారు.

హబ్ద్ విజయ్ దేవరకొండ
హబ్ద్ విజయ్ దేవరకొండ

ఒకప్పుడు డబ్బుల కోసం చిన్న చిన్న పనులు చేసిన ఆయన చిన్న చిన్న ప్రదర్శనలు ఇస్తూ పదివేల రూపాయల కోసం ఎంతో కష్టపడినట్లు గుర్తు చేసుకున్నాడు. అలాగే ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో కూడా నటించారట. అవసరం తీరడం కోసం ఏ పని అయినా ఏ చిన్న క్యారెక్టర్ అయినా సరే ఓకే అని తనకు సరైన అవకాశం వచ్చేవరకు వేచి చూశాడు విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు తన దగ్గర ఉన్న డబ్బు తనకు ఉత్తేజాన్ని ఇవ్వదని ఎందుకంటే తాను చేస్తున్న పనికి తగిన పారితోషకం ఇస్తున్నారని.. తనకు తన అర్హత ఏమిటో తెలుసునని చెబుతున్నాడు..

అంతేకాదు తనకు డబ్బులు ఇస్తేనే పనిచేస్తానని అదే సమయంలో తనకు నచ్చని పనికి ఎంత డబ్బులు ఇచ్చినా చేయను అంటూ తెలిపారు విజయ్ దేవరకొండ. ఒకప్పుడు డబ్బు కోసం నానా తిప్పలు పడిన ఈయన ఇప్పుడు ఆ డబ్బుల కుప్పలుగా పోసుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరొకపక్క తన 12వ చిత్రాన్ని శ్రీ లీలతో తెరకెక్కిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news