గతంలో కరోనా కలిగించిన నష్టాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది, అంతలా ఇది మానవాళిని హడలెత్తించింది. ఇక కొంతకాలంగా మళ్ళీ కరోనా కేసులు కొంచెం కొంచెంగా నమోదు అవుతూ ఆందోళనను కలిగిస్తున్నాయి. కానీ గత రెండు మూడు రోజుల నుండి రోజువారీగా నమోదు అవుతున్న కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రిపోర్ట్స్ ప్రకారం గడిచిన 24 గంటలలో 1331 కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. కాగా ఇదే సమయంలో 11 మంది మృతి చెందినట్లు తెలిపింది. అయితే ఇందులోనూ శుభవార్త ఏమిటంటే… 500 కేసులు తగ్గాయి. ఇలా ఇప్పుడు యాక్టీవ్ గా కేసులను పరిశీలిస్తే 22742 ఉన్నాయి.
కాగా గత 24 గంటల్లో 3752 మంది కరోనా బారి నుండి చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఇకపై కేసులు పెరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సలహాలు మరియు సూచనలు ఇచ్చింది.