నా బంగార్రాజు ఆయనే..తన ప్రేమను కురిపించేసిన కృతి శెట్టి..!

-

కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత వరుసగా రెండు సినిమాలలో నటించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఆ తర్వాత మరో మూడు చిత్రాలలో నటించి డిజాస్టర్ గా మిగిలింది. దీంతో సినీ ఇండస్ట్రీకి దూరం అవుతుందని అందరూ అనుకున్నారు. అవకాశాలు కూడా తగ్గిపోతున్న సమయంలో ఇప్పుడిప్పుడే గ్లామర్ షో మొదలుపెట్టి.. తమిళ్ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇకపోతే తాజాగా తెలుగు సినిమాలో మళ్లీ నాగచైతన్య సరసన నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రముఖ తమిళ డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వంలో తెలుగు,తమిళ్ భాషల్లో కస్టడీ సినిమాను మే 12వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో నాగచైతన్య హీరోగా ,కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ చేపట్టగా అందులో భాగంగా కృతి శెట్టి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక కృతి శెట్టి మాట్లాడుతూ.. ఈరోజు నా నేను ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటే అది మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్.. ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ కూడా లభించింది. దీంతో ఈ సినిమా బాగా నచ్చుతుందని భావిస్తున్నాను.

ఇలాంటి ఒక సినిమాకి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో నేను కాస్త డీ గ్లామర్ గా కనిపిస్తాను. ఇక నేను చేసిన రేవతి పాత్ర మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇక ఎప్పుడు నా ఫేవరెట్ హీరో చైతన్య గారే.. ఆయనే నా బంగార్రాజు.. నా శివ.. ఆయనే అంటూ మాట్లాడింది. కృతి శెట్టి నాగచైతన్య పై తన ప్రేమను వలకబోస్తూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news