ఆ ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్..ప్రియాంకతో ప్లస్ అవుతుందా?

-

తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది..అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో..తెలంగాణలో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు తారస్థాయిలో నడుస్తున్నాయి. దీని వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఈ క్రమంలో పార్టీని లైన్ చేయడంతో పాటు..పార్టీకి కొత్త బలం పెరగడమే లక్ష్యంగా ప్రియాంక గాంధీ ఎంట్రీ ఇస్తున్నారు.

నిరుద్యోగులకు మద్ధతుగా ఆమె భారీ సభలో పాల్గొంటున్నారు. అయితే తెలంగాణలో నిరుద్యోగులు ఎక్కువగానే ఉన్నారు. సొంత రాష్ట్రం వచ్చిన సరే..అనుకున్న మేర నిరుద్యోగులని ఆదుకోవడంలో కే‌సి‌ఆర్ సర్కార్ విఫలమైందనే చెప్పాలి. ఈ క్రమంలో నిరుద్యోగులు కే‌సి‌ఆర్ సర్కార్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రియాంక సభ జరగనుంది. అలాగే నిరుద్యోగులకు కీలక హామీలు కూడా ఇవ్వనున్నారు.  నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి.. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌.. యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రియాంక సభ జరగనుంది.

Priyanka Gandhi

అయితే తెలంగాణలో ఇది ప్రియాంకకు తొలి సభ.  ఈ సభని తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది… భారీ స్థాయిలో విజయవంతం చేయాలని చూస్తున్నారు. ప్రధానంగా యువతని ఆకట్టుకునేలా ప్రియాంక స్పీచ్‌ని రెడీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే టార్గెట్ గా..ప్రియాంక చేత యూత్‌ డిక్లరేషన్ ప్రకటించనున్నారు.

అలాగే బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలని ప్రస్తావించేలా ముందుకెళ్లనున్నారు. అయితే ప్రియాంక ఎంట్రీతో తెలంగాణలో కాంగ్రెస్ కు కాస్త ఊపు వచ్చింది. ఒకవేళ ఆమె సభ గాని భారీ స్థాయిలో సక్సెస్ అయితే..తెలంగాణలో కాంగ్రెస్ కు బలం పెరుగుతుంది. అలాగే పార్టీలో అంతర్గత విభేదాలు సర్ది చెబితే..ఇంకా పార్టీకి ఊపు వస్తుంది. చూడాలి మరి ప్రియాంకతో తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుందో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news