గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లోకి రూ.15 లక్షలు.. ఇలా పొందవచ్చు..!

-

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. రైతులు కేంద్రం అందిస్తున్న ఈ పథకాలతో ఎన్నో లాభాలని పొందుతున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ని కూడా కేంద్రం రైతులకి కోసం తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకి ఎన్నో లాభాలు కలుగుతున్నాయి. ఈ స్కీమ్ తో ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి ప్రతీ ఏటా రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని కేంద్రం ఇస్తోంది. ఈ ఒక్క స్కీమ్ ఏ కాదు రైతుల కోసం పీఎం కిసాన్ ఎఫ్‌పీఓ పథకం కూడా వుంది. ఈ స్కీమ్ కూడా చక్కటి స్కీమ్ ఏ.

farmers

దేశవ్యాప్తంగా రైతులకు కొత్త వ్యవసాయ వ్యాపారాన్ని ప్రారంభం చేసేందుకు ప్రభుత్వం రూ.15 లక్షల రూపాయల ని అందిస్తోంది. ఇక దీని కోసం మరిన్ని వివరాలు చూస్తే.. రైతులకు స్వావలంబన అందించడం, ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు కేంద్రం దీన్ని తీసుకొచ్చింది. దీని కోసం రైతులు కలిసి ఒక సంస్థ లేదా కంపెనీని (FPO) ఏర్పాటు చేసుకోవాలి.

దానిలో 11 మంది రైతులు ఉండాలి. పీఎం కిసాన్ లబ్ధిదారులు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందొచ్చు. ఎరువులు, మందులు, విత్తనాలు వంటి వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. 2023-24 నాటికి 10 వేల ఎప్‌పీఓలను ఏర్పాటు చెయ్యడమే వీళ్ళ లక్ష్యం. ఇప్పటి వరకు 2389 ఎఫ్‌పీఓలు రిజిస్టర్ అయ్యాయి. ఇలా అది ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం.

దీని కోసం మొదట నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ పోర్టల్ https://www.enam.gov.in/ ఓపెన్ చేయాలి.
ఆ తరవాత హోమ్ పేజీ లో FPO లింక్ మీద నొక్కండి.
రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి దరఖాస్తు ప్రాసెస్ ని మొదలు పెట్టాలి.
e-NAM మొబైల్ యాప్‌ లో కూడా దరఖాస్తు చెయ్యచ్చు.
ఆధార్ కార్డ్ , అడ్రస్ ప్రూప్, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు, రేషన్ కార్డ్, ఐ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి. అలానే బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా ఇవ్వాలి.

Read more RELATED
Recommended to you

Latest news