ముద్దులు వాటి రకాలు.. 24 కిస్సెస్ టీజర్..!

-

కాదేది కవితకు అనర్హం అన్నారు ఎవరో కవి కాని ఇది మనం సినిమాలకు వాడుకుంటే కాదేది కాన్సెప్ట్ సినిమాలకు అని చెప్పొచ్చు. ఒక మనిషి ఆలోచనని నమ్మి మరో మనిషి డబ్బు పెట్టి ఆ ఆలోచనని తెరరూపం వచ్చేలా చేయడమే సినిమా. ఇందులోనే రకరకాల జానర్లు ఫైనల్ గా ఆడియెన్స్ మెప్పు పొందిన సినిమానే సూపర్ హిట్. ఇలాంటి లెక్కలు చాలానే ఉంటాయి. అయితే సినిమా హిట్ అవ్వాలి అంటే మాత్రం టార్గెట్ యూత్ ఆడియెన్సే.

ఈమధ్య బాగా వారి ఆలోచనలకు అనుగుణంగా సినిమాలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి, ఆరెక్స్ 100.. ప్రేమ అని చెప్పడం మిగతా పనులన్ని కానిచ్చేయడం ఇది నేటి సినిమాల పరిస్థితి. ఇక అదే కోవలో మరో సినిమా వస్తుంది అదే 24 కిస్సెస్. అయోధ్యా కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కుమారి భామ హెబ్భా పటేల్ నటించింది.

ఆదిత్, హెబ్భాల కిస్సింగ్ కాన్సెప్టే ఈ సినిమా టైటిల్ ను బట్టి ఇందులో 24 కిస్సులు ఉంటాయని తెలుస్తుంది. మరి ఒక్కో ముద్దు ఒక్కో రకంగా పెడతారో ఏమో కాని.. ఈ సినిమా టైటిల్.. వదిలిన టీజర్ చూస్తుంటే ముద్దులు వాటి రకాలు అని హద్దులు దాటి మరి చెప్పేట్టు ఉన్నారు. టీజర్ లో కిస్సులాట ఉండటం.. అది కూడా హెబ్భా లాంటి ముద్దుగుమ్మ హీరోయిన్ అవడం వల్ల సినిమాపై అందరి ఫోకస్ ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news