మహేష్ సినిమా పండుగ మొదలైంది..!

-

సూపర్ స్టార్ మహేష్ సినిమా అంటే ఆ హంగామా వేరేలా ఉంటుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహేష్ 25వ సినిమా తెరకెక్కుతుంది. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ఆగష్టు 9 మహేష్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈరోజు ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ 25 అనే ఏంబ్లం రిలీజ్ చేశారు.

SSMB-25 స్టార్ గుర్తుతో మధ్యలో మహేష్ షాడోలో కనిపిస్తాడు. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. 2019 ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

మరి మొదట ఏంబ్లంతో మొదలు పెట్టిన ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ ఏంబ్లం మహేష్ కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్యలు రిలీజ్ చేయడం జరిగింది. మరి మహేష్ గారాలపట్టి సీతాపాప చేతుల మీదగా ఈ సినిమా ప్రమోషన్ మొదలుపెట్టారన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news