సంచలన నిర్ణయం తీసుకున్న కమల్ హాసన్…!

106

కరోనా వైరస్ నేపధ్యంలో ఎవరి సహకారం వాళ్ళు అందిస్తున్నారు. స్టార్ హీరోలు, చిన్న హీరోలు ఇలా అందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. తాజాగా విలక్షణ నటుడు కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పేద కళాకారులను ఆదుకునేందుకు రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. అంతే కాకుండా మరో కీలక నిర్ణయం ప్రకటించారు. తన ఇంటిని ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.

నా పార్టీ మక్కల్ నీది మయ్యం లోని వైద్యులతో కలిసి నా ఇంటిని హాస్పిటల్‌గా మార్చాలనుకుంటున్నట్టు ఆయన ట్వీట్ చేసారు. తన పార్టీ మక్కల్ నీది మయ్యం నేతలు కూడా సహాయం చేయడానికి ముందుకి రావాలని ఆయన కోరారు. కరోనాను కట్టడి చెయ్యాలి అంటే అందరూ ముందుకి రావాలని ఏ ఒక్కరి వలన అది కట్టడి అయ్యే అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు.

ఇక తమిళ హీరోలు అందరూ కూడా తమ వంతు సహాయం కూడా చేయడానికి ముందుకి వచ్చారు. హీరో ధనుష్ రూ. 15 లక్షలు, శంకర్ రూ.10 లక్షలను పేద కళాకారుల కష్టాలు తీర్చేందకు విరాళం, హీరో శివ కార్తికేయన్ రూ.10 లక్షలు, దర్శకుడు హరి 100 బస్తాల బియ్యం అందించారు. నిర్మాత దిల్లీ బాబు 20 కిలోల అందించారు. ఇలా ఎవరికి వారు ఆదుకోవడానికి ముందుకి వస్తున్నారు. మరి కొంత మంది స్టార్ హీరోలు కూడా సాయం చేయడానికి ముందుకి వస్తున్నారు.