నాని సినిమా దసరా కు లీకేజీల బెడద!

-

నేచురల్ స్టార్ నాని  హీరోగా నటిస్తున్న దసరా అనే సినిమా నిర్మాణంలో ఉంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి నెలలో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా తో కచ్చితంగా హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు. తాను ఆశించినట్లు ఈమూవీ బిజినెస్ నాని కెరియర్ లోనే అత్యధికంగా జరిగిందనే ప్రచారం వుంది.  మొదటి పాట ‘ధూమ్ ధామ్ దోస్తానా’  విడుదలైంది.  ఈ పాటకు రెస్పాన్స్ సూపర్ వస్తోంది దీనికి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. అలాగే ఈ సినిమా లో నటిస్తున్న హీరోయిన్ కీర్తీ సురేష్ లుక్ కూడా రిలీజ్ చేశారు.ఇది కూడా ప్రేక్షకులను ఆకర్షించింది.

ఇక హిట్ కోసం మొత్తం మాస్ లాగా అయ్యాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో లాగా నాని గడ్డం తో చింపిరి జుట్టు పాత లుంగీ నలిగిన చొక్కాతోచాలా మాస్ గా  హడావుడి చేస్తున్నాడు. ఇక పోస్టర్ వెనకాల సిల్క్ స్మిత పోస్టర్ పెట్టుకొని మా సినిమాలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని సింబాలిక్ గా చెబుతున్నాడు. ఇంత కష్ట పడుతున్న నాని కి ఆకస్మాత్తుగా ఈ కు షాక్ తగిలింది.

ఈ షూటింగ్ సెట్స్ నుంచి లీకైన ఓ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది గమనించిన యూనిట్ వర్గాలు ట్విట్టర్ వేదికగా అభిమానులకు రిక్వెస్ట్ చేశారు. నెట్టింట వైరలవుతున్న ఆ లీక్డ్ వీడియోను ఎవరు షేర్ చేయొద్దని.. మరికొద్ది రోజుల్లో సాలిడ్ అప్డేట్ ఇస్తామని.. అప్పటివరకు ఓపిక పట్టాలని న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్‏ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక సినిమా విడుదల అయ్యి నాని సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news