కార్తికేయ-3 పై క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్…!!

చాలాకాలం తర్వాత హీరో నిఖిల్ కార్తికేయ-2 చిత్రం ద్వారా ఒక మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందారు. ఇ చిత్రాన్ని డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా మిస్టరీకల్ థ్రిల్లర్ చిత్రంగా తెలుగు ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా రూ.100 పైగా కలెక్షన్లు సాధించింది. ఇక ఈ రెండు సినిమాలు మంచి విజయం కావడంతో కార్తికేయ -3 కూడా వస్తుందా అనే అనుమానాలు అభిమానులలో మొదలయ్యాయి.

అయితే ఈ విషయంపై హీరో నిఖిల్ స్పందిస్తూ.. కార్తికేయ-3 పై క్లారిటీ ఇవ్వడం జరిగింది. కార్తికేయ సినిమాని రెండు భాగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అందరి దీవెనలు, ఆశీర్వాదాలతో కార్తికేయ -3 సినిమాని కూడా ప్రారంభిస్తున్నాము అని తెలియజేశారు నిఖిల్. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తారు అనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు నిఖిల్. అయితే ఈసారి కార్తికేయ -3 ని 3D లో రూపొందించబోతున్నట్లు మాత్రం తెలియజేశారు నిఖిల్.

శ్రీకృష్ణుని ద్వారకాలో దాగి ఉన్న పలు రహస్యాలు నేపథ్యంలో కార్తికేయ -2 చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. కీలకమైన పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమకేర్ కూడా నటించారు. ఇక శ్రీనివాసరెడ్డి, సత్య ,వైవాహర్ష తదితరులు కూడా ఈ చిత్రంలో నటనతో బాగా ఆకట్టుకున్నారు. అతి తక్కువ బడ్జెట్ తో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కార్తికేయ-2 చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమాని కేరళలో మలయాళంలో కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నది చిత్రం బృందం.