హీరో శ్రీకాంత్ కూమార్తె ఎంత అందంగా ఉందో చూశారా?

తెలుగు అగ్ర హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఫ్యామిలి కథా చిత్రాలకు కెరాఫ్ అని అంటారు.హీరోగా ఎన్నో సినిమాల లో నటించి మంచి సక్సెస్ ను అందుకున్నారు.ఆ తర్వాత సహాయ నటుడుగా కూడా చేసి మంచి గుర్తింపును అందుకున్నాడు..ఇప్పటికీ శ్రీకాంత్ సినిమాలు వస్తున్నాయి అంటే జనాలు టీవీలకు అతుక్కుపోతున్నారు.

కెరియర్ మొదట్లో ఫుల్ జోష్ మీద ఉన్న శ్రీకాంత్ కు ఇప్పుడు అవకాశాలు కరువైయ్యాయి. దాంతో విలన్ పాత్రలతో సరి పెత్తుకున్నారు.ఇటీవల విడుదలైన బాలయ్య అఖండ సినిమాలో విలన్ గా కనిపించారు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది..ఇక ఆయన కుటుంబం విషయాన్నికొస్తే.. శ్రీ‌కాంత్ భార్య ఊహ అన్న విష‌యం తెలిసిందే. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే వీరికి ముగ్గురు సంతానం క‌లిగారు. ఇద్ద‌రు కుమారులు రోష‌న్‌, రోహ‌న్ కాగా.. కుమార్తె మేధ‌ ఉన్నారు..
కాగా, మొన్నీమధ్య శ్రీకాంత్ కుటుంబం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఈ క్ర‌మంలోనే తిరుమ‌ల మాడ వీధుల్లో ఊహ‌తోపాటు మేధ కూడా క‌నిపించింది. ఎరుపు రంగు లంగాహొనీలో కనిపించింది.ఆ డ్రెస్ లో మేధా చాలా క్యూట్ గా ఉండటంతో అభిమానులు ఆమె తో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తో తల్లి నోట్లో నుంచి ఊడిపడినట్లు చాలా అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..