సుమన్ బ్లూ ఫిల్మ్ కేసులో చిరంజీవి కుట్ర.. ఇంతకీ ఆయన ఏమన్నారు..!

-

1980 దశకంలో తెలుగు హీరోగా సుమన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చేలా ఒడ్డు పొడుగు అంతా చక్కగా సుమన్ లో ఉండేవి. అయితే కెరియర్ మంచిగా బిల్డప్ అవుతున్న సమయంలో బ్లూ ఫిల్మ్ కేసులో అతన్ని ఇరికించి జైలు పాలయ్యేలా చేశారు. తనకు పోటీగా వస్తున్నాడని చిరంజీవే సుమన్ ను అరెస్ట్ చేయించాడని అందరు అన్నారు.

వాటికి సుమన్ ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూనే ఉన్నారు.. అయినా సరే మెగా ఫ్యామిలీపై అబాండాలు వేస్తున్నారు. చిరంజీవితో మాములుగా సినిమాల పరంగా పోటీ కామనే కాని తనని అరెస్ట్ చేయించింది ఆయన కాదని మరోసారి చెప్పారు సుమన్. తన స్నేహితులు కొందరు తన కారులో అమ్మాయిని తీసుకు రావడం వల్ల ఇదంతా జరిగిందని. అయితే తన మీద పెట్టిన కేసుకి సరీన సాక్ష్యాధారాలు లేక కేసు కొట్టివేశారని చెప్పాడు. 1985 మే 19 న తనని అరెస్ట్ చేశారని.. 1989లో నిర్ధోషిగా రిలీజ్ చేశారని సుమన్ చెప్పారు.

అయితే ఈలోగా తన కెరియర్ కు జగాల్సిన నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. తన మీద తప్పుడు కేసు పెట్టిన వారిని సినిమా హీరోగా ప్రతీకారం తీర్చుకోవడం కుదరదు కాబట్టి తన పని తాను చేసుకుంటూ వెళ్తునానని చెప్పారు సుమన్. ఇప్పటికి తెలుగు, తమిళ భాషల్లో స్పెషల్ పాత్రల్లో అలరిస్తున్నారు సుమన్.

Read more RELATED
Recommended to you

Latest news