నన్ను ఆపేవాడు ఎవ్వరు లేరు ..!

విజయ్ దేవరకొండ సినిమాలు అనగానే చాలా మందికి ఉండే అభిప్రాయం ఏంటీ అంటే… కాస్త స్టోరీ బోల్డ్ గా ఉంటుంది అని. అర్జున్ రెడ్డి సినిమాతో ఇదే విషయం స్పష్టంగా అర్ధమైంది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో అంతగా లేకపోయినా ప్రస్తుత౦ వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా మాత్రం ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. అందుకే విజయ్ కి కాస్త క్రేజ్ మళ్ళీ యూత్ లో పెరిగిపోతు౦ది. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ప్రేక్షకుల ముందుకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా యూత్ ని టార్గెట్ చేసే చేసాడు విజయ్.

దీనితో సోషల్ మీడియాలో విజయ్ ని టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు చేస్తున్నారు. మీ సినిమాలు యువతను పాడు చేసే విధంగా ఉన్నాయని, ఎప్పుడూ ఇలాంటి సినిమాలేనా అంటూ ఫైర్ అవుతున్నారు జనం విజయ్ మీద. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా కాస్త వేగంగా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాలో విజయ్ షేడ్స్ పై అభిమానులు ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. ఇదే విషయాన్ని విలేఖర్లు విజయ్ ని ప్రశ్నించార్. ఎందుకు ఇలాంటి పాత్రలే చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి విజయ్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

తనపై ట్రోల్స్‌ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందని కామెంట్ చేసాడు. తన కోసం కాస్త టైమ్‌ను కేటాయించి మరీ ట్రోల్స్‌, మీమ్స్ తయారు చేస్తున్నారని సంతోషంగా చెప్పాడు. ఎప్పుడూ లేనంతగా తనపై ట్రోల్స్ వస్తున్నాయంటే దాని అర్ధం వాళ్ల కలలో కూడా నేనే కనిపిస్తున్నానేమో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. నా స్టైల్, సినిమాల్లో నా ఎక్స్ ప్రేషన్స్ గురించి మీమ్స్ తయారు చేసే వాళ్లు, నన్ను ఎంతగా ఫాలో అవుతున్నారో అనిపిస్తోందని సంబరపడ్డాడు. ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా సరే నేను మాత్రం భారతీయ సినిమాను ఏలాలనుకుంటున్నానని కామెంట్ చేసాడు.