ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బ ఇప్పుడు భయపెడుతుంది. ప్రజలు బయటకు రావాలీ అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం. అన్ని దేశాలు కూడా కరోనా విషయంలో చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అనుమాన౦ వస్తే చాలు పరిక్షలు చేస్తున్నాయి. వాళ్లను ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స చేస్తున్నారు వైద్యులు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది.
ప్రధానంగా చైనా పక్కన పెట్టి చూస్తే, భారత్, ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, జపాన్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఉత్తరకొరియాలో ఒక సంఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ సోకింది అనే అనుమానంతో ఒక వ్యక్తిని పోలీసులు కాల్చి చంపిన ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తుంది.
ఇప్పటి వరకు చైనా సరిహద్దునే ఉన్నా ఉత్తరకొరియా ఆ దేశానికి కరోన వైరస్ తాకలేదు. అక్కడి ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకున్న నేపధ్యంలో కరోనా ఆ దేశంలోకి ఇంకా రాలేదు. అయితే కరోనా ఉంది అనే అనుమానంతో ఉత్తరకొరియా లో వ్యక్తని కరోనా వైరస్ వచ్చింది అనే అనుమానంతో పోలీసులు ఒక వ్యక్తిని కాల్చి చంపేశారు. అతడికి ఏ వైద్య పరిక్షలు చేయకుండా కేవలం ఒక్క అనుమానంతోనే కాల్చి చంపడం ఇప్పుడు ఆవేదన కలిగిస్తుంది.