రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా తెరకెక్కనున్న లియో క్లైమాక్స్..

-

సూపర్ స్టార్ విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ సంవత్సరం వారసుడు సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు తలపతి. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విజయ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం విజయ్ తమిళ యంగ్ స్టార్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా నడుస్తోంది. ఈమధ్యే స్టార్ట్ అయిన ఈమూవీ షూటింగ్.. అప్పుడే క్లైమాక్స్ కు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఈ క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణకు చిత్రం బృందం హైదరాబాద్కు రానున్నట్టు సమాచారం.

లియో చిత్రం సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతుండగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘మాస్టర్’ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. హీరోయిన్ గా త్రిష తన అందం, టాలెంట్, ఫిట్ నెస్ తో మరోసారి కెరీర్ ను స్టార్ట్ చేసి.. ఈ సినిమాతో తానేంటో నిరూపించుకోవడం కోసం రెడీ అవుతోంది.

ప్రస్తుతం దాదాపు షూటింగ్ క్లైమాక్స్ వరకూ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చెన్నైలో జరుగుతోంది. విజయ్, అర్జున్ ఇతర ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఆ షెడ్యూల్ పూర్తి కాగానే సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచే సన్నివేశాలను హైదరాబాద్ లో షూట్ చేయడం కోసం ఇక్కడికి రాబోతున్నరట టీమ్. ఈ సన్నివేశాలను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్గా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో విజయ్, త్రిషతో పాటుగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ , గౌతమ్ మీనన్ ,మిస్కిన్ , మన్సూర్ అలీఖాన్ , ప్రియా ఆనంద్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. మూవీని అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news