హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ చేదు అనుభవం.. ఏం జరిగిందంటే..!!

తెలుగులో మొదటిసారిగా RX -100 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ తన మొదటి సినిమాతోనే బోల్డ్ హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకుంది. ఇక తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెలుబడుతూనే ఉన్నాయి. తరచూ ఎప్పుడూ హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులకు సైతం నిద్ర లేకుండా చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎయిర్ పోర్టు లో కోప్పడినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

స్కిన్ షో చేయడంలో ఏమాత్రం మొహమాట పడకుండా ఎలాంటి సినిమాలు అయినా నటించడానికి ఒకే చెబుతూ ఉంటుంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం మంచు విష్ణు తో కలిసి జిన్నా అనే చిత్రంలో నటిస్తున్నది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తనకు జరిగిన ఒక విషయాన్ని సైతం అభిమానులతో పంచుకుంది. ఎయిర్ పోర్ట్ స్టాప్ పై ఆమె చాలా మండిపడుతోంది.. ఇటీవల తను ఇండిగో విమానంలో ప్రయాణించినట్లుగా తెలియజేసింది. ఈ సందర్భంగా తన లగేజ్ ను ఇండిగో విమాన సిబ్బంది ఇష్టానుసారంగా విసిరిపారేసారని తెలియజేయడం జరిగింది.

తమ ప్రయాణికుల లగేజ్ ను నిర్లక్ష్యంగా ఇలా విసిరి పారేశారు అంటూ దీంతో లగేజ్ డ్యామేజ్ అయిందని ఆమె తెలియజేసింది. ఈ ప్రయాణం తనకు ఎన్నడూ ఎదురు కాలేదని ఇలాంటి చేదు అనుభవాన్ని ఈ ప్రయాణం మిగిలించింది అని తెలియజేసింది. ప్రస్తుతం తన లగేజ్ డ్యామేజ్ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసి.. ఇండిగో విమాన సిబ్బంది అత్యుత్సాహం వల్లే ఇలా జరిగిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ప్రస్తుతం ఈమె చేసిన ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.